Wednesday, August 4, 2010

బాగ్లోకం లో మొదటి అడుగు..

నా పేరు సీత! సగటు మనిషిని. స్త్రీ ని. ఒక సగటు భారత స్త్రీ కున్న కష్ట నష్టాలు, బాధలూ, బరువులూ, మర్యాదా, మన్ననా, అన్నీ స్వయానా/లేక ఇతరుల ద్వారా అనుభవించిన దాన్ని.

భారత నారి వ్యక్తిత్వానికి ప్రతీకని అని నేననను. ఒక మామూలు మనిషిని, ఆడదాన్ని, ఒకరికి కూతుర్ని, ఒకరికి భార్యని, ఒకరికి ఇల్లాలిని, ముగ్గురు బిడ్డల తల్లిని, అక్కని, మరదల్ని, చెల్ల్లిని, వదినని, ఒక చిన్న ఆఫీస్ లో ఇంజనీర్ ని, ఒక ఎన్ జీ ఓ లో వాలంటీర్ ని.
తెలుగు లో బ్లాగు రాద్దామని అనుకుని సీతాకాలం అని పేరు పెట్టుకుని మెయిల్ ఐడీ అయితే క్రియేట్ చేశా కానీ, శరత్ కాలం అన్న బ్లాగ్ చూశాక కాపీ అనుకుంటారని కాస్త వెనుకంజ వేశా. నిన్న శరత్ కాలం లో ఆడ బ్లాగర్ల గురించి చదివాక, సరే ఎలాగూ అనుకుంటే అనుకుంటారని ఆయన టెంప్లేట్ కాపీ చేసా. ఆయన స్లోగన్ కూడా.
నాలుగు రోజులు పోయాక నా టెంప్లేట్, స్లోగన్ మారుస్తా. కాస్త బ్లాగ్ టెక్నాలజీ అర్థం కావాలి. అలాగే మా ఆఫీస్ లో ఇంటర్నెట్ ఉండదు. కాబట్టి నెమ్మది రోజూ ఒక అరగంట మాత్రమే బ్లాగ్లోకం లో విహరించటానికి నాకు టైం. అందులోనే.. బ్లాగులు చదవటం, రాయటం, ఏది జరిగినా!
సీత.

10 comments:

  1. శరత్ కి పేరడీ బ్లాగు కాదు కదా:)

    ReplyDelete
  2. బ్లాగులోకంలోకి స్వాగతం,

    నేను ఎంతో కాలంగా చదువుతున్న ఓ మహిళా బ్లాగరు అమెరికాలో ఉంది. ఆ అమ్మాయి బ్లాగు చదవండి అలాగే వీలైతే అంత ఖచ్చింతా వ్రాయండి. లంకె = http://girlfromflorida.blogspot.com/ .. ఈ అమ్మాయి ఓ ఇద్దరు పిల్లల తల్లి. ఈ అమ్మాయి బ్లాగు మరియు మరిన్ని విషయాలకై తొందర్లో నా బ్లాగుని చూడండి.

    మీ ఊరు పేరు వంటి విషయాలు వ్రాయక్కరలేదు కానీ వ్రాసేవాటిల్లో ఎన్ని మీ హృదయాంతరాలలో నుంచి వచ్చాయో ఒక్క సారి ఆలోచించుకోండి. అంతే కాని ఏదో సెటైర్ కోసం మాత్రం వ్రాయవద్దని మనవి

    ReplyDelete
  3. కొంపదీసి తెలుగుపీపుల్ పద్మా జయరామో బలరామో కాదుకదా?

    ReplyDelete
  4. అభినందనలు. అప్పుడే మొదటి పోస్ట్ రాసేసారే! మీ సీరియస్నెస్ చూస్తుంటే నాకు పేరడీ బ్లాగ్ అని అయితే అనిపించడం లేదు. మీ మనస్సు స్వేదం లోనుండి అవిర్భవించే టపాలను ఆహ్వానిస్తున్నాను.

    ReplyDelete
  5. "కాబట్టి నెమ్మది రోజూ ఒక అరగంట మాత్రమే బ్లాగ్లోకం లో విహరించటానికి నాకు టైం. " అవును మరి...మిగతా బ్లాగులు కూడా రాయాలి కదా???ఏమంటారు '..............' బాబు??

    ReplyDelete
  6. అమ్మో నామెస్సేజ్ అందుకుని
    దానికి ప్రతి గా బ్లాగ్ లోకం లో
    పగ తీర్చు కోడానికి వేంచేసిన సీత కాదు కదా?

    ReplyDelete