Thursday, August 12, 2010

బస్సుల్లో కామాంధులు..

రవి చూపుడు వేలు సుతారం గా రాధ చేతిని మీటింది. తొలి పురుష స్పర్శ కి ఆమె ఉద్వేగం తో కంపించిపోయింది.. విసుగ్గా పుస్తకం విసిరేసాను ఒక పక్కకి. "ష్యూర్.. ఈ రాసే వాళ్ళకి బుద్ధీ జ్ఞానం లేదు.. అసలే లోకం లో ఉంటున్నారు వీళ్ళసలు? తొలి పురుష స్పర్శా? బీ యెస్స్సా? అంటే ఆ అమ్మాయి ఎక్కడ పెరిగింది? ఒక ఇసోలేటెడ్ చాంబర్ లోనా? ఎనిమిదో క్లాస్ లో వెనక బెంచీ పిల్లల దగ్గర్నించీ, ఆఫీస్ లో పక్క క్యూబ్ శ్రీనివాస్ (సారీ వికట కవి సీనూ! ) దాకా పొరపాట్న తగిలినట్టు చేయి తగిలించిన వాళ్ళే కదా.. అలాగని ఎదురు పడిన ప్రతి మనిషీ అలాంటి వారేనని కాదు కానీ.. మరీ ఈ విధం గా రాసేవాళ్ళు ఏమాలోచిస్తుంటారో.. చికాకేసింది. సిటీ బస్ హార్న్ కొట్టుకుంటూ వెళ్తోంది, కిటికీ అవతల. అసలు బస్సుల్లో ఎంత దుర్మార్గం.. మీద మీదకి పడటం, పైగా ఏమైనా అడిగితే..అంత కష్టం గా ఉంటే టాక్సీ లో వెళ్ళు ..బస్సులెందుకు ఎక్కుతావ్? అని అడగటం.. జెర్కిచ్చినా, బ్రేకేసినా.. మీద ఒరిగిపోవటం, తెలియనట్టు నటించటం.. కొంతమంది నడుం గిల్లటం, లేదా, ఎక్కడ పడితే అక్కడ చరచటం.. ఏమీ ఎరగనట్టు ఏటో చూడటం...నాకాశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. కాస్త రౌడీ లుక్ ఉన్నవాళ్ళే బెటర్..కనీసం ప్రిటెన్స్ ఉండదు.. కాకిగోల.. వెధా కామెంట్లు, వాడేదైనా కోతివేషమేస్తే.. గట్టిగా అన్నా చుట్టూ జనాలు నమ్ముతారు. మంచి గంభీరం గా కళ్ళజోడూ, ఇస్త్రీ బట్టలేసుకునే ఆసాములతో పెద్ద చిక్కే.. వాళ్ళని తిరిగి అడిగినా ఎవ్వరూ నమ్మరు భీ. కాలేజ్ టైం లో మా రూట్ లో ఒకతను, వయసు ఒక పాతికుంటాయేమో, రోజూ ఎవరో ఒక అమ్మాయిని టార్గెట్ చేసుకుని ఆ అమ్మాయి మాత్రమే చూసేలా జిప్ తీయటం.. ఒకమ్మాయి అయితే బిక్క చచ్చిపోయి.. చాలా రోజులు రికవర్ అవలేదు. పోనీ బస్సుల్లో ఇలా జరుగుతోందని చెప్తే ఇంట్లో వాళ్ళూ అంతే.. నువ్వేం చేస్తున్నావో.. తల వంచుకుని తిరిగితే.. వాడెందుకు నీవెనక పడతాడు? అందర్నీ వదిలేసి నీతోనే ఎందుకు మిస్బిహేవ్ చేస్తాడు? అని మా పైకే నెట్టటం.. అసలు మానేసేయ్ కాలేజ్ అన్నాడట ఒకమ్మాయి అన్నగారు.. ఎంత గొప్ప మనిషో.. . రోజూ ఎక్కేవాడు..ఒక్కసారి కూడా ఎవ్వరం వాడిని ఎదిరించలేదు. ఇప్పుడు అనిపిస్తుంది.. భయపడకుండా అందరూ (కనీసం 10-15 మంది ఉండేవాళ్ళం) బస్సులోంచి లాగి చెప్పుదెబ్బలేస్తే సరిపోయేదేమో..వాడేమీ పెద్ద గాంగ్ ని తెచ్చి గొడవపెట్టుకునే రకం లా అనిపించలేదు.. ఆరోజుల్లో ఎందుకంత ధైర్యం లేదో.. ఎవరికీ చెప్పుకోలేక, వాడిని పట్టుకుని వాయించలేక ఎంత చిత్రవధ అనుభవించామో ఆరోజుల్లో. ఒకసారి తెల్లటి సల్వార్ కమీజ్ వేసుకుని వస్తుంటే.. ఎవరో కావాలని ఆ రష్ లో తొక్కిడి లో పాన్ నమిలి ఉమ్మేసాడు వెనక. ఏంటా అనుకున్నా.. అంత రష్ లో తెలియలేదు ఇంటి కొచ్చాక చూసుకుంటే ఎంత బాధనిపించిందో..

ఆ రూటూ, కాలేజీ వదిలేసి డికేడ్ దాటిపోయింది. మొన్న ఒక లెక్చరర్ రిటైర్ అవుతున్నారని పూర్వ విద్యార్థులందర్నీ పిలిస్తే..వెళ్ళాం. ఆ రోజుల గురించి మాట్లాడుతూ వాడి గురించి ఎత్తాను. చాలా మంది సైలెంట్.. మాటల్లో తేలిందేంటంటే అందరూ ఆ కష్టం అనుభవించారట ఎప్పుడో ఒకసారి. మళ్ళీ అప్పుడే జరిగినట్టు గా అనిపించి భగ్గుమని మండింది. ఏం చేస్తాం? కాలం వెనక్కి రాదు కదా? బాధనిపించింది.

5 comments:

  1. పాపం మా శ్రీను భాయ్‌ను ఎందుకండీ మాటిమాటికి బకరాను చేస్తున్నారు.
    ఇకపోతే అలాంటి చచ్చు సన్నాసులకు ఒకటే మందు...విప్లవం

    ReplyDelete
  2. ఆమె అంగీకరించి రొమాంటిక్ మూడ్ లో వున్నపుడు తనకు నచ్చిన పురుషుడు మొదటిసారి తాకితే వచ్చే ఫీల్ గురించి ఆ రచయిత రాశారనుకుంటా. మీరు మరీ సీరియస్ గా తీసుకున్నారు :-)

    ReplyDelete
  3. అలా మగవారు చేస్తే ఆనందించే ఆడవారు కూడా వుంటారు కదా.

    ఈ ఇబ్బంది ఎయిర్ హోస్టెసులకు కూడా బాగానే వుంటుందనుకుంటా. ఒకసారి కెనడా నుండి వయా అబుదబి నో ఏమో వస్తున్నాను. గల్ఫ్ ఎయిర్ వేస్ లో వస్తున్నా అనుకుంటా. వారి విమానాల్లో ఎయిర్ హోస్టెసులు అందంగా వుంటారు. ఆ రోజు విమానం మారి అబుదాబి నుండి హైదరాబాద్ వెళ్ళే విమానం ఎక్కుతున్నాము. నేను చూస్తుండగానే ఒక యువకుడు ఓ చక్కటి యంగ్ ఇండియన్ ఎయిర్‌హోస్టెస్ వక్షభాగాన్ని గట్టిగా కావాలనే పొరపాటుగా తాకినట్లు మోచేతితో తాకేడు. ఆ అమ్మాయి ఓ సారి అతని వైపు కోపంగా, ఛీత్కారంగా చూడటం మినహా ఏమీ చెయ్యలేకపోయింది.

    ReplyDelete
  4. మగధీర సినీమా నచ్చలేదని డైరెక్టుగా చెప్పచ్చు కదా :))

    ReplyDelete
  5. ఓసోస్, ఇంతేనా?

    ఈ మాత్రం దానికే కామాంధులు, కామ సెవిటోల్లు లాంటి పెద్దమాటలెందుకండీ బాబో!

    నా మేల్ ఫ్రెండ్స్ కొంతమంది బాంబే లోకల్ రైల్లలో తింగరి కామాంధుల చేతుల్లో & చేతల్లో అనుభవించిన టార్చెర్ ముందు, ఇది చిన్న నలుసు మాత్రమే!

    ReplyDelete