Thursday, August 5, 2010

వృద్ధనారీ పతివ్రతా..

స్కూల్లో పక్క బెంచ్ లో కూర్చునేది శ్రీవిద్య. మా టౌన్లో ఉన్న స్కూళ్ళన్నింటిలో మాదే మంచి స్కూలని పేరు. 9 వ తరగతి లో స్కూల్ కి 10 రోజులు రాలేదు. తర్వాత వచ్చాక క్లాస్ లో పిల్లలంతా విద్యా విద్యా అంటూ వెనకే.. చాలా ఎంజాయ్ చేసేది. మేమంతా గొంగళీ పురుగుల్లా..అదొక్కత్తే శీతాకోకచిలక లా.. పదో క్లాస్ లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి మాతో ఇంటికి నడుస్తూ రావటం మానేసింది. కొత్త పరిచయాలు.. మందలిద్దామంటే మాకూ భయం/క్యూరియాసిటీ. శ్రీనివాస్ అన్న అబ్బాయితో తిరిగేది. పరిచయం ఎంత వరకూ .వెళ్ళిందో తెలియదు.మాతో మాటలు తగ్గించేసింది. మాకేమో దాన్ని చూస్తే హీరో వర్షిప్! తర్వాత ఇంటర్ లో ఎంసెట్ కోచింగ్ అని నేను బిజీ. ఇంటర్ లో ఒకసారి రాత్రి వస్తుంటే కార్నర్ లో చెట్టు పక్క గుస గుస.. నేను నిలబడిపోయి.. ఎవరో చూద్దాం అని..నెమ్మదిగా చూస్తే.. అదే విద్య. పక్కనున్నది శ్రీనివాస్ కాదు. నన్ను చూసి వాడెళ్ళిపోయాడు. ఇది బట్టలు సద్దుకుంటూ వచ్చింది. నాకు చాలా ఎక్జైట్మెంట్.. ఏం చేస్తున్నారు? అని అడిగితే ఏమీలేదు.. పద అంది. శ్రీనివాస్ ఏమయ్యాడు? అంటే.. వాడి గొడవ ఎందుకు? అంది. ఎవ్వరికీ చెప్పకు వాడు నన్ను ప్రేమిస్తున్నాదు. పేరు వెంకట్ . అంది. ఏం చేస్తాడు? అంటే బీ కాం ఫస్ట్ అంది. తర్వాత చాలా రోజులు కనపడలేదు. ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ రాంక్ వచ్చాక వేరే ఊళ్ళో హాస్టెల్ లో చదవాలి.. స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసాం. విడిపోతుంటే.. చంద్రశేఖర్ ట దీని కొత్త "ఫ్రెండ్" మోటర్ సైకిల్ మీద వచ్చాడు.. వార్నీ అనుకున్నాం. ఇంజనీరింగ్ అయ్యాక.. విశ్వనాథ్ తో కనిపించింది ఒక హోటల్లో.. మా అమ్మావాళ్ళకి కూడా పరిచయం చేసింది. నా వుడ్ బీ అని. తర్వాత ఎవరిద్వారానో విన్నాను దాని పెళ్ళయిందని. లాస్ట్ ఇయర్ మా హైదరాబాద్ లో కనపడింది. ముందు గుర్తుపట్టలేదు. బొద్దుగా, మాంగో యెల్లో చీర, బొట్టూ, గాజులూ, చాలా బాగుంది. సాఇ బాబా గుడి కెళ్ళివస్తున్నా అంది. ఇల్లు దగ్గరే రా అని పిలిచింది. వాళ్ళాయన ని పరిచయం చేసింది. 'ఈయన పేరు.. అని.. ' నేం ప్లేట్ చూపించింది. వాళ్ళత్తగారు కల్పించుకుని చెప్పారు. మురిపెం గా కోడల్ని చూస్తూ.. మా ఇళ్ళళ్ళో మేం వదిలేసాం కానీ.. విద్య మాత్రం ఇంకా పాటిస్తోంది.. భర్త పేరు ఎత్తదు.. వాడి పేరు ప్రసాద్.. అని..
దాని మొహం లో ఎక్కడా..మర్యాదా, అణకువా,భక్తీ తప్ప వేరే భావమేమీ లేశమాత్రమైనా కనిపించలేదు.. . అసలే పతివ్రతాయె..

14 comments:

  1. మొదటి బకరా పేరు శ్రీనివాస్ అనే పెట్టాలా హతవిధి

    ReplyDelete
  2. నాకేమి తెలీదు బాబు నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి :(

    ReplyDelete
  3. ఇలాంటి శ్రీవిద్యలు నా లైఫ్ లోకూడా బోలెడు మంది ఉన్నారు..............
    అలాంటి వాళ్ళని ఏమి చేయలేం......................................................................
    మళ్లీ శ్రీనివాసో, వెంకటో, లేదా ఇంకే తల మాసిన వాడో తగిలితే పాపం వాళ్ళాయన........................
    "పెళ్లి ఐన ప్రసాద్" అయినా "పెళ్లి కాని ప్రసాద్" అయినా పెద్దగా తేడా ఏమి ఉండదు..................

    ReplyDelete
  4. "'ఈయన పేరు.. అని.. ' నేం ప్లేట్ చూపించింది"

    ముందుగా ఇది చదివి నేను అనుకున్నదేమంటే మంది ఎక్కువయ్యి భర్త పేరు మరచిపోయిందేమోనని!

    ReplyDelete
  5. hello.. sharath...
    Neeku anukunnattugane blog start chesavu...
    good....
    E nattakalu evvariki teliyavayya...
    neeku chathanina rojulu cover chesuko.....
    Kani first nenu kanipettanni gurthukunchuko

    ReplyDelete
  6. @ శ్రీనివాస్ , వెంకట్
    అట్టా అంటే ఎట్టా అమ్మా ? మేము ఒప్పుకోము, మీకు శీల పరీక్ష , అగ్ని గుండ ప్రవేశం పెడదామని అధ్యక్షులకి వినతి పత్రం ఇస్తాము :)

    ReplyDelete
  7. Pardon me if I am wrong but your style of writing is definitely masculine.

    ReplyDelete
  8. miru entandi mi stories evo rastaaru anukunte, mi friends vi raastunnaru? at least valla names anna marchandi, hope you don't want to create any problems for these subjects.

    May be she learned a lesson and do not want to spoil this relation??

    ReplyDelete
  9. శరత్ గారు...ఆమాత్రం గుర్తు పట్టలేమనుకున్నర???ఒకే ఒక్క లినే తో నేను కనిపెట్టేస...కచ్చితం గా ఇది మీరే అండి....

    ReplyDelete
  10. @శశిపాల్, కవిత
    నేనెప్పుడయినా అబద్ధాలు చెప్పినట్టుగా మీకు అనిపించిందా? అలాంటప్పుడు ఇలా నేను వేరే రూపమ్లో రావాల్సిన అవసరం ఏంటీ? నా టపాలకు స్పందించి సీత గారు బ్లాగు వ్రాస్తుండటం నన్ను కూడా సంభ్రమాశ్చర్యాలల్లో్ ముంచివేసింది. సీత గారి గురించి మీ అందరికి ఎంత తెలుసో నాకూ అంతే తెలుసు. వీరు నిజ్జంగా స్త్రీనేనా అన్న అనుమానం కొందరికి ఎలా వుందో నాకూ అలాగే వుంది. చాట్ లల్లో ఆడపేరుతో మగవారు చాట్ చేస్తుండటం సర్వ సాధారణం. కొంత అనుమానం ఎలాగూ వున్నా ప్రస్తుతానికి అయితే ఎక్కువ భాగం వీరు స్త్రీ అనే విశ్వసిస్తున్నాను. ముందు ముందు టపాలని బట్టి గమనించవచ్చు.

    ReplyDelete
  11. నేనెప్పుడో కని పెట్టా వొక బ్లాగు రెండు కాలం లని అది కాక కొత్త బ్లాగర్ కి కామెంట్స్ అప్ప్రొవల్ తెలివి తేటలు వుండవు అప్పుడే .

    ReplyDelete
  12. Andharu Paata chinta ka ya pachadi lage comments raasaru..andu lo Srividya tappemundhi..just life enjoy chesindhi as it comes....magallaite inka ekkuva gane vuntundhi...so Magalla kaite ok.. kani ladies ki not okay? what is this... freedom antaru...elanti comments chestaru...just think

    ReplyDelete
  13. శరత్ పాచిక పారినట్టుంది. ఆడాళ్ళు రాసే స్లీజ్ మొదలయ్యింది. ఇంక ఫుల్లు టైం పాసే

    ReplyDelete
  14. @ మధు
    మీరు చెప్పింది నిజమే. నేను కూడా ఈ పోస్టుకి సరిగ్గా స్పదించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. స్రీవిద్యని అభినందిచాల్సి వుంది. తన జీవితాన్ని కనీసం పెళ్ళికి ముందయినా చాలా చక్కగా ఎంజాయ్ చేసింది.

    ఈ బ్లాగులో మరిన్ని పోస్టుల కోసం ఎదురుచూస్తున్నాను.

    ReplyDelete