Friday, August 6, 2010

శరతేనా? అసలు రాసేది ఆడా? మగా? తెలిసిన బ్లాగరేనా?

శరత్ బ్లాగ్ చూడకముందు సీతా కాలం అని సరదాగా బ్లాగ్ క్రియేట్ చేసినా శరత్ కాలం చూశాక వద్దులే కాపీలా ఉంటుంది అని నేను అక్కడికే వదిలేశాను. తర్వాత అన్ని బ్లాగ్స్ చదువుతూ, అవగాహన పెంపొందించుకుందామని చూస్తూ ఉన్నాను. అప్పుడే అనాన్ ల కామెంట్స్, స్వభావం, అర్థం చేసుకుంటూ వస్తున్నాను. కామెంట్ మాడరేషన్ ఎనేబుల్ చేసుకుని తీరాలని అర్థమయ్యింది. యాధృచ్చికం గా ఆయన బ్లాగ్ లో ఆడ బ్లాగర్ల గురించి రాసిన వ్యాసం నన్ను ఆకర్షించింది. అవును.. అసభ్యం, అశ్లీలం కానంతవరకూ ఒక బ్లాగ్ లో ఎందుకు ఇంకొన్ని నిజాలు మనం రాసుకోకూడదు? విషయం ప్రధానం. కానీ ఎవరు రాశారు? వాళ్ళని వ్యక్తిగతం గా అటాక్ చేద్దాం అనే అనాన్ ల కామెంట్లు ప్రచురించను. కానీ మిగిలిన కామెంట్లు ప్రచురిస్తాను. అలాగే ఈ బ్లాగ్ లో ఏదో ఏ టాగ్ ఉన్న విషయాలుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశే. ఎవరు నమ్మినా నమ్మకున్నా నా పేరు సీత. నేను భారత స్త్రీనే.




రేపటి పోస్ట్ లో : బస్సుల్లో కామాంధులు.

4 comments:

  1. సీత కాలం అని పెట్టుకోవటం పై శరత్ కాలం కు అభ్యంతరం ఎందుకుంటుంది? తెలుగు కాలాల మీద అమెరికాలో పేటెంటేమైనా వుందేమో కనుక్కోండి, ఎందుకైనా మంచిది. వుంటే పేరు మార్చుకుని ' సీత కాలమా? ' అని పెట్టుకోండి. :)

    ReplyDelete
  2. @snkr
    నాకు అభ్యంతరం వుంటుందని కాదు పైన వారన్నది - కాపీ చేసినట్లు వుంటుందని.

    @సీత
    మీ తదుపరి పోస్టు కోసం ఎదురుచూస్తున్నాను.

    ReplyDelete
  3. హాయ్ సీత గారు, మీరు చెప్పదలుచుకున్న విషయం నాకు బాగా నచ్చింది. ఎందుకు అంటే మనలో 99 % మంది చెప్పలేరు ఇలాంటి సంగతుల్ని. కీప్ ఇట్ అప్. మీ వెనక ఒక సైనికుడిగా నేను నిలబడతాను. తెలుగు కాలాల మీద అమెరికాలో పేటెంటే తీసుకోవడం కుదరదు. కాబట్టి మీరుపేరు మార్చవద్దు. నేను కూడా శరత్ & మీ బాటలో నడుస్తాను. తొందరలోనే...

    ReplyDelete
  4. హాయ్ సీత గారు, మీరు చెప్పదలుచుకున్న విషయం నాకు బాగా నచ్చింది. ఎందుకు అంటే మనలో 99 % మంది చెప్పలేరు ఇలాంటి సంగతుల్ని. కీప్ ఇట్ అప్. మీ వెనక ఒక సైనికుడిగా నేను నిలబడతాను. తెలుగు కాలాల మీద అమెరికాలో పేటెంటే తీసుకోవడం కుదరదు. కాబట్టి మీరుపేరు మార్చవద్దు. నేను కూడా శరత్ & మీ బాటలో నడుస్తాను. తొందరలోనే...

    ReplyDelete